Date : 24 October 2026
Posted By : RVI

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి

టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 16 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి టిబెట్‌లో 7.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10కి.మీటర్ల లోతున.. కౌంటీకి 70 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. దీని ధాటికి టిబెట్‌లో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు బయటకు పరుగుతు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. భూకంప తీవ్రత దృష్ట్యా లెవల్‌-2 అత్యవసరస్థితిని చైనా ప్రకటించింది. చైనా విపత్తు నిర్వహణ సంస్థ పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది.