నాగిరెడ్దిపేట్ మాల్తుమ్మెద గ్రామంలో శ్రీ సద్గురు శబరిమతాజీ 37వ వార్షికోత్సవం మహా కార్యక్రమం జరిగింది.పరబవనామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ త్రయోదశి రోజున అనగా 23-10-2026 రోజున ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది.గ్రామంలో ఉన్న దేవరాధనతో ప్రతి దేవాలయానికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి మొదలు అవడం జరుగుతుంది. తరువాత శబరిమతాజీ చిత్రపటాన్ని శావాలో ఊరేగింపుగా భక్తులు,సంకీర్తనలతో,ఆటపాటలతో రంగరంగా వైభావంగా తీసుకెళ్తారు.అనంతరం
ఇట్టి కార్యక్రమంలో వేద బ్రాహ్మనోత్తముల చేత సద్గురు శబరిమతాజీ గారి పాదుక పూజ,మహిళల చేత అష్టోత్తర శతనామావలి మంత్రములతో పుష్పర్చన .. తదుపరి అన్నదానం కార్యక్రమం, సంధ్యకాల సమయం నుండి రాత్రి తెల్లవారే సమయం వరకు భజన సంకీర్తనలచే కార్యక్రమం జరుగుతుంది.. ఇక్కడికి 50 గ్రామాలనుంచే కాకుండా 5 జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కుల,మత,బేధం లేకుండా ప్రజలందరూ పాల్గొని ప్రవచనాలు, భజనలు చేస్తూ విజయవంతం చేస్తారు..