భూమిలోకి కుంగిన బోరింగ్ పంపు
పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామంలో బోరింగ్ పంపు భూమిలోకి కుంగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి జీఎం లలిత్ కుమార్ సహా అధికారులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తమ గ్రామం సింగరేణి జీడీకే-1 ఇంక్లైన్ గనిపై ఉండటంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తమ నివాసాలూ కుంగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.